డిజిటల్ పేమెంట్ల వలన కొంత మంది భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. వారికి సహాయం చేసేందుకు కౌంటర్లలో పది మంది సిబ్బందిని అదనంగా నియమించాం. సత్రాల వద్ద వ్రతం, ప్రసాదం, దర్శనం టికెట్లు పొందేందుకు కియోస్క్‌లు ఏర్పాటు చేశాం. వైఫై సదుపాయం కోసం రూటర్లు ఏర్పాటు చేశాం. సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలకు లేఖలు రాయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. ఈ సమస్యలన్నీ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తాం.
– నల్లం సూర్యచక్రధరరావు,
ఈఓ, అన్నవరం దేవస్థానం


