మండు వేసవిలో చెండాడే ఎండల్లో ప్రయాణించే వారికి చలివేంద్రాలు చల్లని నేస్తాలుగా నిలుస్తున్నాయి. ఎండ తీవ్రతకు, వడగాడ్పులకు సామాన్యుడి గొంతెండి పోకుండా రోడ్ల వెంబడి ఎక్కడికక్కడ దాతలు ఏర్పాటు చేస్తున్న ఇవి సేద తీరుస్తున్నాయి. వాహనదారుల దాహార్తి తీర్చేందుకు మేము సిద్ధం అన్నట్టు కొలువుదీరిన ఈ కూలింగ్ వాటర్ టిన్నులు కాకినాడ రూరల్ రమణయ్యపేట వద్ద పిఠాపురం రోడ్డులో కన్పించాయి. సామాజిక కార్యకర్త అనపాల ఆంజనేయరెడ్డి వీటిని ఏర్పాటు చేశారు.
– కాకినాడ రూరల్


