● దేవి ఫిషరీస్ వద్ద పెదబొడ్డు
వెంకటాయపాలెం గ్రామస్తుల ఆందోళన
● అస్వస్థతకు గురైన పలువురు
ఆస్పత్రుల్లో చేరిక
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి వస్తున్న కలుషిత జలాలు కాలువలోకి వదలడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పెదబొడ్డు వెంకటాయపా లెం గ్రామస్తులు సోమవారం స్థానిక దేవి ఫిషరీష్ వద్ద ఆందోళన చేసి బాధ్యులను శిక్షించాలని, ఆయా కంపెనీలపై అధికారులు దృష్టి సారించాలని నినాదాలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు పాలెపు పోశియ్య, గ్రామ పెద్దలు పంట కాలువ చెంతనే ఉన్న కంపెనీలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు మూడు రోజులుగా గ్రామంలో సుమారు 30 మంది వివిధ ఆస్పత్రిలలో వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు.


