సబ్‌ జూనియర్స్‌ చాంపియన్‌ షిప్‌ ఏపీఎస్పీ కై వసం | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జూనియర్స్‌ చాంపియన్‌ షిప్‌ ఏపీఎస్పీ కై వసం

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

కాకినాడ రూరల్‌: ఈ నెల 9, 10 తేదీలలో ఏపీఎస్పీ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఏపీఎస్పీ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సబ్‌ జూనియర్స్‌ చాంపియన్‌ షిప్‌ను ఏపీఎస్పీ టీం కై వసం చేసుకుంది. రెండవ స్థానంలో పిఠాపురం, మూడవ స్థానంలో రాజమండ్రి నిలిచాయి. ఈ కార్యక్రమంలో ధర్డ్‌ ఏపీఎస్పీ కమాండెంట్‌ దేవానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు. క్రీడాకారులను ఉద్దేశిస్తూ క్రీడలలో మంచి భవిష్యత్తు ఉన్నాయని, ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మీరు ఇలాగే రాణించి ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గన్నమనేని చక్రవర్తి, జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు, ఏపీఎస్పీ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దాట్ల సుబ్బరాజు, శంకర్‌, మహేష్‌, వసీం ఖాన్‌, రాకేష్‌, దుర్గ, నయింఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement