రంపచోడవరం: దేశ స్వాతంత్య్ర కోసం బ్రిటిష్ వారిపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని పోలవరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పి.అంబేద్కర్ అన్నారు. అల్లూరి 102వ వర్ధంతిని పురస్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అల్లూరి చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి, ఆయన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీఓ డీఎన్‌వీ రమణ, డీఆర్‌డీఏ పీడీ దాసరి రత్నాకర్, డీహెచ్‌ఓ దేవదానం, డీఏఓ రామ్మోహనరావు పాల్గొన్నారు.
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన..
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన రంపచోడవరంలో అల్లూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఆ పార్టీ నాయకుడు పల్లాల లచ్చిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి స్ఫూర్తితో ఆదివాసీ ప్రాంతాల్లో నేషనల్ పార్కులు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
సభలో మాట్లాడుతున్న
లచ్చిరెడ్డి


