పిఠాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునేలా.. విజయ సోపానాలు అధిరోహించేలా.. పది మందిలో సగర్వంగా తలెత్తుకునేలా ‘సాక్షి’ తోడ్పాటునందించింది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా.. ‘సాక్షి’ దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ అనేక మంది విద్యార్థులకు బాసటగా నిలిచింది. గణితం, సైన్స్ సబ్జెక్టులపై నిపుణుల ఆధ్వర్యాన రూపొందించిన ఈ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ ఉచితంగా అందించింది. అంతే కాకుండా పత్రికలో ప్రతి రోజూ సబ్జెక్టుల వారీగా నిపుణుల సూచనలతో పాఠాలు ప్రచురించింది. రోజువారీ బోధనకు తోడు ఈ మెటీరియల్, పాఠాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడమే కాకుండా అవగాహన కోసం పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా సబ్జెక్టులపై పట్టు పెరిగి, వార్షిక పరీక్షల్లో ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించారు. గొల్లప్రోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులే దీనికి ఉదాహరణగా నిలిచారు. ఈ పాఠశాల నుంచి టెన్త్ పరీక్షలకు 144 మంది హాజరవగా 131 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 22 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. నాణ్యమైన కంటెంట్, సులభమైన వివరణలతో ‘సాక్షి’ అందించిన మెటీరియల్ తమను టాపర్లుగా నిలిపిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ టెన్త్‌లో గొల్లప్రోలు
జెడ్పీ గర్‌ల్స్ హైస్కూల్ ప్రతిభ
ఫ 22 మందికి 500కు పైగా మార్కులు
ఫ ‘సాక్షి’ మెటీరియల్‌తోనే ఈ ఘనత
సాధించామన్న విద్యార్థినులు


