వివాహితపై లైంగిక దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

వివాహితపై లైంగిక దాడికి యత్నం

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

– కేసు నమోదు

తుని రూరల్‌: తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన పలివెల శివమణి తనపై లైంగిక దాడికి యత్నించాడని అదే గ్రామానికి చెందిన వివాహిత ఫిర్యాదు చేసింది. ఆదివారం రాత్రి తన కుమార్తెతో ఇంట్లో నిద్రిస్తుండగా బయట నుంచి ఎవరో తలుపు తట్టడంతో తెరిచానన్నారు. తెలుపు తెరవగానే పలివెల శివమణి తన నోరు మూసివేసి నెట్టుకుంకూ ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి యత్నించాడన్నారు. పరిస్థితిని గమనించి భయాందోళనతో కేకలు వేస్తూ కుమార్తెను తీసుకుని బయటకు వచ్చేశానన్నారు. ఈ విషయం ఎవరికై నా తెలియజేస్తే చంపేస్తానని బెదిరించినట్టు ఆమె తెలిపింది. తనకు భర్త లేడని, కుమార్తెతో నివాసం ఉంటున్నట్టు తెలిపింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు ఆమె తెలిపింది. శివమణి జిల్లా ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వివాహిత మహిళ నుంచి అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్సై కృష్ణమాచారి తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ శాఖ ఇన్‌చార్జి

డీఐజీగా జయలక్ష్మి

కాకినాడ లీగల్‌: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ సీహెచ్‌ జానకీదేవి వ్యక్తిగత కారణంగా సోమవారం నుంచి సెలవు పెట్టారు. ఆమె స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్‌ అండ్‌ ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న జె.యు.ఎన్‌ .జయలక్ష్మిని ఇన్‌చార్జి డీఐజీగా నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఖాళీ బిందెలతో

మహిళల నిరసన

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): మంచినీళ్లివ్వండి మహాప్రభో... అంటూ గొల్లప్రోలు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో మహిళల నిరసన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా స్థానిక అరుంధతిపేటలో తాగునీరు రావడం లేదని, నాలుగు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండు వేసవిలో తాగేందుకు గుక్కెడు నీరు లేకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, తమ కాలనీలకు తాగు అందివ్వాలని కోరారు.

జిల్లా అగ్నిమాపక శాఖ

అధికారిగా కృపావరం

కాకినాడ క్రైం: జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా సీహెచ్‌ కృపావరం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జిల్లా అధికారిగా పనిచేస్తున్న ఆయన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడకు వచ్చారు. ఇదే స్థానంలో పనిచేసిన పివి.రాజేష్‌ వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో చర్యల్లో భాగంగా సస్పెండ్‌ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement