సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భారీగా తరలివచ్చిన భక్తులతో సోమవారం కిటకిటలాడింది. రత్నగిరితో బాటు పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధుమిత్రులతో కలిసి వేలాదిగా తరలి వచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. దేవస్థానానికి రూ. 40 లక్షలు ఆదాయం సమకూరింది. సోమవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు, శంకరుడు ముత్యాలు పొదిగిన కవచాలు (ముత్తంగి) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement