ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) కాకినాడలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు కాకినాడలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ పరీక్షకు 3,126 మంది దరఖాస్తు చేసుకోగా 3,080 మంది హాజరయ్యారు. జీపీటీ కళాశాల, ఆనంద భారతి గ్రౌండ్‌ వద్ద రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ పాఠశాలల్లోని కేంద్రాలను కలెక్టర్‌ హరీంధిర ప్రసాద్‌, గాంధీనగర్‌ పైండా సత్తిరాజు మున్సిపల్‌ పాఠశాలను కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబు సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement