విందు భౌజనం | - | Sakshi
Sakshi News home page

విందు భౌజనం

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

పోషకాహారం అందించాలి

పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం సహజమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రతి పెట్‌ పేరెంట్‌ బాధ్యత. ప్రస్తుతం కాకినాడలో సేవలందిస్తున్నాం. త్వరలోనే మా సంస్థను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో సాగుతున్నాం.

– డాక్టర్‌ బాల సువర్ణ, పెట్‌ ఫుడ్‌ సెంటర్‌

నిర్వాహకురాలు, కాకినాడ

ప్రతి పెట్‌కు హెల్దీ ఫుడ్‌

అందించే లక్ష్యంతో..

పెంపుడు జంతువులకు ఇప్పటి వరకూ ఎక్కువగా రెడీమేడ్‌ ప్యాకేజ్‌ ఫుడ్‌ అందించేవారు. అయితే, వాటిలోని ప్రిజర్వేటివ్స్‌, కృత్రిమ పదార్థాల వల్ల పెట్స్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్‌ ఫుడ్‌ సెంటర్‌ థాలీ ద్వారా తాజా పదార్థాలతో, నాణ్యత, శుభ్రత, పోషక విలువలుండే పెట్‌ ఫుడ్‌ తయారు చేస్తూ శాసీ్త్రయంగా సమతుల ఆహారం అందిస్తున్నాం.

– కల్యాణి, పెట్‌ ఫుడ్‌ సెంటర్‌

భాగస్వామి, కాకినాడ

నా కుక్క ఇష్టంగా తింటోంది

అంతకు ముందు రెడీమేడ్‌ ప్యాకింగ్‌ ఫుడ్‌ పెడితే మా కుక్క అంత ఇష్టంగా తినేది కాదు. ఇప్పుడు చాలా ఇష్టంగా తింటోంది. ఆరోగ్యంగా, చురుకుగా ఉంటోంది. అందుకే ఫుడ్‌ సెంటర్‌లోని ఆహారాన్ని కొని మా కుక్కకు పెడుతున్నాం. ప్రతి రోజూ అప్పటికప్పుడు వేడివేడిగా వంటకాలు తయారు చేసి ఇస్తున్నారు. ఈ పద్ధతి చాలా బాగుంది.

– చిన్ని, కాకినాడ

పిఠాపురం: సాధారణంగా జాతిని బట్టి కుక్కలకు తగిన ఆహారాన్ని వాటి యజమానులు ఇళ్ల వద్దే తయారు చేసి పెడుతుంటారు. కొన్నిచోట్ల దుకాణాల్లో వివిధ రకాల బిస్కెట్లు, రెడీమేడ్‌ ఫుడ్‌ అమ్ముతారు. కానీ, ట్రెండ్‌ మారింది. కుక్కలకూ ఓ రోజు వచ్చింది. వాటికీ ప్రత్యేకంగా కేటరింగ్‌ సెంటర్లు వెలిశాయి. శాకాహారం మాంసాహారం తదితర రకరకాల ఆహారాన్ని తయారు చేసి కుక్కలను పెంచుకుంటున్న వారికి ఇళ్ల వద్దనే అందజేస్తున్న వ్యాపారం ప్రస్తుతం ఊపందుకుంటోంది.

రిచ్‌ మెనూతో..

పెట్‌ కేటరర్లు కుక్కలకు నోరూరించే రిచ్‌ మెనూతో విందు భోజనం అందిస్తున్నారు. డాగ్‌ సేఫ్‌ చికెన్‌ ధమ్‌ బిర్యానీ, పనీర్‌ ఆధారంగా ప్రొటీన్‌ రిచ్‌ వెజ్‌ మీల్స్‌, పెట్‌ స్పెషల్‌ కాక్‌టెయిల్స్‌ (సమ్మర్‌ డ్రింకులు), డాగ్‌ ఫ్రెండ్లీ ఐస్‌ క్రీములు, పెట్‌ స్వీట్లు కుక్కల కోసం తయారు చేస్తున్నారు. కస్టమైజ్డ్‌ డైట్‌ ప్లాన్లలో భాగంగా పప్పీలు, సిక్‌ పెట్‌లకు.. చూలు కుక్కలు, పప్పీల కోసం ప్రత్యేక పోషకాహారం, హై ప్రొటీన్‌, సులభంగా జీర్ణమయ్యే, వెటర్నరీ వైద్యుల సలహాతో ప్రత్యేక డైట్‌ అందిస్తున్నారు. ఇంకా చికెన్‌, పనీర్‌, కూరగాయలు, అన్నం వంటివి కుక్కల వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఆర్డర్లపై తాజా ఆహారం తయారు చేసి హోం డెలివరీ ఇస్తున్నారు.

కుక్కలకూ కేటరింగ్‌ సెంటర్లు

సమ్మర్‌ డ్రింకులు, ఐస్‌క్రీములు,

సలాడ్‌లు, స్వీట్లు

ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ

జంతుప్రియులను ఆకర్షిస్తున్న

పెట్‌ ఫుడ్‌ సెంటర్లు

Advertisement
 
Advertisement
Advertisement