పెదపూడి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన విద్యార్థిని దూళ్ల చిన్నారి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈఓలు–1, 2 జి.విశ్వనాథ్, సీవీవీ సత్యనారాయణ ఈ విషయం తెలిపారు. సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన చిన్నారి ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ, చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణతో చదివిన తమ విద్యార్థిని చిన్నారి జిల్లా ఫస్ట్ సాధించడం అభినందనీయమని అన్నారు. సీఏ చదవాలనేదే తన లక్ష్యమని చిన్నారి ఈ సందర్భంగా తెలిపింది.


