వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

Oct 26 2025 12:42 PM | Updated on Oct 26 2025 12:42 PM

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం పలువురు జిల్లా నాయకులను వివిధ హోదాల్లో నియమించింది. జిల్లా ఐటీ వింగ్‌ ఉపాఽధ్యక్షుడిగా దిడ్డి ప్రతాప్‌ (జగ్గంపేట), జనరల్‌ సెక్రటరీలుగా మేడిశెట్టి సీతారామ్‌ (తుని), కేఎన్‌ఎం స్వామి (పిఠాపురం), సెక్రటరీలుగా బొకిస ప్రసాద్‌ (తుని), మొగిలి శ్రీనివాస్‌ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా త్రిమూర్తుల నాగేంద్ర(తుని), పైలా గంగాధర్‌ (తుని), తూము సురేష్‌ (జగ్గంపేట), అడారి రమేష్‌ (జగ్గంపేట) నియమితులయ్యారు.

డాక్టర్స్‌ విభాగంలో..

జిల్లా డాక్టర్స్‌ వింగ్‌ ఉపాధ్యక్షులుగా గొర్లి విష్ణు (తుని), వేగి సాంబశివ (జగ్గంపేట), సెక్రటరీలుగా యాసరపు వెంకట రమణ (తుని), నాంబారి సత్యనారాయణ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా బర్ల శ్రీను (తుని), యాసరపు భూషణం (తుని), యల్లపు పవన్‌ కుమార్‌ (జగ్గంపేట), ములపర్తి నాగేశ్వరరావు (జగ్గంపేట)లను నియమించారు.

జిల్లా వలంటీర్ల విభాగంలో..

జిల్లా వలంటీర్ల విభాగం ఉపాధ్యక్షుడిగా ఉమ్మలూరి వెంకట రమణ (ప్రత్తిపాడు), జనరల్‌ సెక్రటరీలుగా అడిగర్ల ప్రసాద్‌ (తుని), మడగల నవీన్‌ (జగ్గంపేట), సెక్రటరీలుగా గరగ నాగ దుర్గాప్రసాద్‌ (తుని), అమరాది కాశి (ప్రత్తిపాడు), మంగరౌతు గౌరి (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా బట్ట సాయి (తుని), మేడిశెట్టి ఫణీంద్ర సాయి (తుని), అడబాల వెంకట రమణమూర్తి (ప్రత్తిపాడు), మాదపురెడ్డి జితేంద్ర (ప్రత్తిపాడు), కె.అప్పారావు (జగ్గంపేట), పిల్ల అప్పారావు (జగ్గంపేట) నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement