నాకు రెండున్నర ఎకరాల బత్తాయి తోట ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో కాయ పెద్దగా ఊరలేదు. కొద్ది రోజుల క్రితం కాయలు విక్రయించాను. టన్నుకు రూ. 35వేల వరకు ధర వచ్చింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి ధరలు బాగా వస్తున్నాయి.
– మనోహర్‌రెడ్డి,
రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం
మార్కెట్‌లో డిమాండ్..
జిల్లాలో కొన్ని చోట్ల మినహాయిస్తే, చాలా చోట్ల బత్తాయి దిగుబడులు బాగా వచ్చాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి మార్కెట్‌లో మంచి ధరలు వస్తున్నాయి. ఈ నెలలో బత్తాయికి డిమాండ్ బాగా పెరగడం వల్ల ధరలు ఎక్కువగా వస్తున్నాయి.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి


