కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు ఆపాలి. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా 2021 వేతన సవరణ, 30శాతం ఫిట్‌మెంట్ అమలు, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేతపై చర్యలు చేపట్టాలి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ఆశాభావంతో ఉన్నాం.
– రాంనాథ్, ఆర్టీసీ కార్మికుడు, గద్వాల
సమస్యలను అధిగమిస్తాం..
ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిబ్బందికి సైతం పనిభారం పెరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం అమలు తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బస్సు సర్వీసుల కొరత ఉంది. త్వరలో నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తాం. డిపో పరిఽధిలోని కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం.
– సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల
●


