
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల రూరల్: విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అవసరమయ్యే కులం, ఆదాయం సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే జారీ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ హాల్‌లో ఎంఈఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ఆధార్‌కార్డు, బోనఫైడ్ తప్పనిసరిగా తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేయాలని, బ్యాంక్ అకౌంట్లు తప్పులు లేకుండా దరఖాస్తు చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా ఎస్సీ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన కులం, ఆదాయం సర్టిఫికెట్లను మీసేవ వారితో మాట్లాడి సర్టిఫికెట్లను వంద శాతం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్‌లోని ధరణి సమస్యలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పూర్తి చేయాలన్నా రు. అయిజ, కేటీదొడ్డి, అలంపూర్, మానవపాడు మండలాల్లో పెడింగ్‌లోని వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిని, డీఈఓ సీరాజుద్దీన్, తహసీల్దార్లు, ఎంఈఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి