
ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి: అనధికార చిట్‌ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 24మంది బాధితుల నుంచి ఎస్పీ వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు అనధికార చిట్‌ఫండ్, అక్రమ ఫైనాన్స్ ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనధికార చిట్‌ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం వలన ఇబ్బందులు ఎదుర్కొనే వారు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మొబైల్ నంబర్‌కు 87126 58108 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఎస్పీ కిరణ్ ఖరే