
‘ఎల్‌సీ’ నిర్లక్ష్యంపై సీఎండీ అసహనం
హన్మకొండ : ఎల్‌సీ యాప్ వినియోగంలో నిర్లక్ష్యంపై విద్యుత్ ఇంజనీర్లు, ఆపరేటర్లపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈ, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఎల్‌సీ యాప్ నిర్వహణ, డ్యాష్‌బోర్డులో పారామీటర్ల నమో దు, విద్యుత్ అంతరాయాలపై సమీక్షించారు. విద్యుత్ ప్రమాదాలు తగ్గించేందుకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రవేశ పెట్టిన ఎల్‌సీ యాప్‌పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా డ్యాష్ బోర్డులో ఎవరు ఏ పని చేస్తున్నారో నమోదు చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, జీఎం శ్రీనివాస్, ఎస్‌ఈ లు, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.
డ్యాష్ బోర్డులో వివరాల నమోదులో అలసత్వంౖపై సీరియస్