
విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి
● జిల్లా విద్యాధికారి రాజేందర్
రేగొండ(కొత్తపల్లిగోరి): విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రభాకర్, కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో కొత్తపల్లిగోరి మండల విద్యాధికారి రాజు ఆధ్వర్యంలో బోధనాభ్యాస ప్రక్రియలు అనే అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజేందర్ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలన్నారు. బోధనలో ఐసీటీ వినియోగం, ఏఐ బోధన, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంపై అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్స్ పింగళి విజయపాల్‌రెడ్డి, ప్రసాద్, అఫ్రజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.