భూపాలపల్లి అర్బన్: నేటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలకు తావులేకుండా చూడాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, నోడల్ అధికారి వెంకన్న పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్