
ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల వివరాలు
ఖిలా వరంగల్: నూతన విద్యా సంవత్సరం ఈనెల 12నుంచి ప్రారంభమైంది. కళాశాలలు, పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులను తరలించేందుకు స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటికి తప్పకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే వాహనాలకు ఫిట్‌నెస్ చేయించాలి. ఇందుకోసం రవాణా శాఖ అధికా రులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే 15 వరకు ఇచ్చారు. ఒక వైపు విద్యాసంస్థలు ప్రారంభమైనా ఇంకా ఉమ్మడి జిల్లాలో 25శాతానికి పైగా బస్సులకు ఫిట్‌నెస్ కావాల్సి ఉంది. 10 బస్సులు ఉన్న విద్యాసంస్థలో 6 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ చేయించి మిగిలిన వాటికి ఫిట్‌నెస్ లేకుండానే రోడ్డు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో మొత్తం స్కూల్ బస్సులు 1,755 ఉన్నాయి. అందులో ఇప్పటి వరకూ ఫిట్‌నెస్ సర్టిఫి కెట్లు పొందినవి 1,182 మాత్రమే. మిగిలిన 573బస్సుల్లో త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. కాల పరిమితి పూర్తి చేసుకున్న, వివిధ కారణాలతో 225 బస్సులను అధికారులను ఫిట్‌నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 348 బస్సులకు ఆన్‌లైన్ చేసి ఫిట్‌నెస్ సిర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉందని డీటీసీ చెబుతున్నారు.
తూతూ మంత్రంగా పరీక్షలు..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రైౖవేట్ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలను సంబంధిత ఆధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆధికారులు అప్రమత్తమవుతారు. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేస్తే బాగుంటుందని పలువురు ఆభిప్రాయపడుతున్నారు.
ఆర్టీఏ అధికారుల ఏం చేయాలి..?
పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి బస్సు ఫిట్‌నెస్ పకడ్బందీగా చూడాలి. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సుల ఉంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్‌నెస్ అయిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తుండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి.
తనిఖీలు నిర్వహిస్తున్నాం..
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సకాలంలో బస్సులకు ఫిట్‌నెస్ చేయించుకోవాలి. పాఠశాలల పునఃప్రారంభం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్‌లేని బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని వీడి ఫిట్‌నెస్‌లు చేయించుకోవాలి. ఆనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– పుప్పాల శ్రీనివాస్, డీటీసీ హనుమకొండ
జిల్లా మొత్తం ఫిట్‌నెస్ చేయించు
బస్సులు చేసుకున్నవి కోవాల్సినవి
వరంగల్ 352 252 100
హనుమకొండ 920 621 299
జనగామ 103 76 27
భూపాలపల్లి 130 89 41
ములుగు 95 50 45
మహబూబాబాద్ 155 94 61
మొత్తం 1,755 1,182 573

ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల వివరాలు