● జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు పూర్తి
● 10వ తేదీన వర్చువల్‌గా
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనగామ: పట్టణానికి ప్రాధాన్యాన్ని చాటుతూ, వచ్చే నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా జనగామ రైల్వేస్టేషన్ సుందరీకరణ మొదటి విడత పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో స్టేషన్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ వెలుగు జిలుగులు సంతరించుకున్నాయి. స్టేషన్‌ప్రాంగణం ఆధునికతతో రూపాంతరం చెందుతూ, పెద్ద నగరాల రైల్వే స్టేషన్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ఆధునిక ఏసీ వెయిటింగ్ రూములు, ప్రాంగణంలో ఆకర్షణీయ విద్యుత్ దీపాలు వంటి అత్యాధునిక వసతులతో కొత్త రూపం సంతరించుకుంది. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల వెలుగులతో స్టేషన్ ధగధగలాడుతుండడంతో ప్రజలు ఆసక్తిగా సందర్శిస్తూ సరికొత్త అందాలను ఆస్వాదిస్తున్నారు.


