విజిలెన్స్‌ అధికారులు వచ్చారని.. | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అధికారులు వచ్చారని..

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు వచ్చారని సమాచారం అందుకున్న పలు డాక్యుమెంటు రైటర్లు దుకాణాలను క్లోజ్‌ చేసి పరారీ అయ్యారు. ఈ సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్న ఓ డాక్యుమెంటు రైటర్‌ను విజిలెన్స్‌ బృందం విచారించింది. మిగతా డాక్యుమెంటు రైటర్లను పిలిపించే స మయంలో అందుబాటులో ఎవరూ లేకుండా పోయారు. డాక్యుమెంటు రైటర్లు తప్పు చేయని పక్షంలో భయపడి షెట్టర్లను క్లోజ్‌ చేసి ఎందుకు వెళ్లి పోయారు..? అసలు కమీషన్ల దందా వెనక వీరి పాత్ర ఏమైనా ఉటుందా? అనే ప్రజల అనుమానాలకు నిజమనే సమాధానం సైతం ఉండవచ్చని తెలుస్తోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై సైతం నిఘా వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement