విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

జఫర్‌గఢ్‌: సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్న పదిమందికి సహాయపడాలన్న చదువుతోనే సాధ్యమవుతుందని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ శ్రీదేవి అన్నారు. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాధరణ అనాథ ఆశ్రమంలో శనివారం బాల్య వివాహాల విముక్త భారతం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్ప అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ ఏధి సాధించాలన్న చదువు ఎంతో ముఖ్యమన్నారు. పాఠ్యపుస్తకాలే కాకుండా వాటితో పాటు రోజు వారి వార్త పత్రికలు, లైబ్రరీలో పుస్తకాలు ఒక గంట పాటు చదివినట్లయితే సమాజంపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా లీగల్‌ అడ్వైజర్‌ దయామణి, అడ్వకేట్‌ అనిల్‌, పీఓ స్వప్నరాణి, స్కోప్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మనోజ్‌, పూజ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

నేడు మున్సిపల్‌ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’

జనగామ: ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు జనగామ మున్సిపల్‌ ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు బతుకమ్మ కుంటలో ‘హ్యాపీ సండే’ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా మాస్టర్‌ గీతేష్‌ కుమార్‌ బజాజ్‌ ఆధ్వర్యంలో యోగాసనాలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం నవ్వుల కార్యక్రమం, తడి పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన ఉంటుందన్నారు.

పాత వాహనాలతో ఇబ్బందులు

జనగామ: బియ్యం రవాణా సమయంలో పాత వాహనాలను ఉపయోగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్‌ అన్నారు. ఈ మేరకు జనగామ మండలం వడ్లకొండ గోదాంను కాజీపేట ఎఫ్‌సీఐ మేనేజర్‌ నేత్ర ప్రకాష్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సీఎంఆర్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ గోదాంలకు తరలించడంలో పాత వాహనాలు ఉపయోగించడంతో మిల్లర్లు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఆలస్యం, ఆపరేషనల్‌ సమస్యలు ఏర్పడి, సమయానుకూల డెలివరీ కష్టమవుతోందని విన్నవించారు. జనగామ మండలం యశ్వంతాపూర్‌, వడ్లకొండ గోదాంల వద్దకు చేరే వాహనాలను అదే రోజు అన్‌లోడ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ 2024–25 సీజన్‌లో సుమారు 700 ఏసీకేఎస్‌ బియ్యం చేరనున్నట్లు లేఖలో పేర్కొంటూ, తమ అభ్యర్థనను పరిశీలించి, అవసరమైన సహాయం అందించాలని కోరారు. అధ్యక్షుడి వెంట కార్యదర్శి గాదె శ్రీనివాస్‌, కోశాధికారి మార్యాల లక్మినారాయణ ఉన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నర్మెట (తరిగొప్పుల): ఎరువుల దుకాణాలను పారదర్శకంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఏఓ అంబికా సోని అన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలకేంద్రంలోని ఎరువుల దుకా ణాలను ఎస్సై గుగులోత్‌ శ్రీదేవి, ఎంఏఓ మనోహిత్‌ విక్రంతో కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనా లు, పురుగుల మందులు, లైసెన్స్‌లు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. లైసెన్స్‌లను, స్టాక్‌ బోర్డుల వివరాలను ప్రదర్శించాలని, స్టాక్‌ రిజిస్టర్లను ప్రతిరోజు అప్‌డేట్‌ చేయాలన్నారు. మోతాదుకు మించి ఎరువులను, పురుగు మందులను వాడొద్దన్నారు. ప్రెజ్ఞాపురం నర్సింహులు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement