డిజిటల్‌ చెల్లింపులు బెటర్‌! | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులు బెటర్‌!

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

జనగామ: ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులు ఎలాంటి బిల్లులను అయినా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో వినియోగదారులు కార్యాలయాలకు తిరగకుండా ఎక్కడి నుంచైనా చెల్లించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. వినియోగదారుల సౌకర్యార్థం నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌పీడీసీఎల్‌) డిజిటల్‌ చెల్లింపుల విధానంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులు

ప్రతీ ఏటా సుమారు 10 శాతం మేర వినియోగదారులు తమ నెలవారీ విద్యుత్‌ బిల్లులను టీజీ ఎన్‌పీడీసీఎల్‌ యాప్‌తో పాటు టీ–వాలెట్‌, గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, హెచ్‌డీఎఫ్‌సీ ఆన్‌లైన్‌, ఇండియన్‌ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫారంల ద్వారా చెల్లిస్తున్నారు. గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెల 30,753 మంది వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేయగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 33,942కు పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకునే విధంగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యుత్‌ కార్యాలయాల కౌంటర్ల వద్దకు వెళ్లి ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా రెండు నిమిషాల వ్యవధిలో చెల్లింపులు చేసుకునే విధంగా అవకాశం ఉంది.

ఎండ తీవ్రతతో ఆన్‌లైన్‌ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ

ఆన్‌లైన్‌ పేమెంట్‌ చెల్లించండి

విద్యుత్‌ వినియోగదారులు తమ బిల్లులను ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించి సమయం ఆదా చేసుకోండి. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఎన్‌పీడీసీఎల్‌ యాప్‌ను డౌన్‌్‌ లోడ్‌ చేసుకుని, విద్యుత్‌ బిల్లుపై ఉన్న యూఎస్సీ నంబర్‌ను నమోదు చేసి సులభంగా బిల్లు చెల్లించవచ్చు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు, సేవలను సులభతరం చేసి ఆధునీకరించేందుకు టీజీఎన్‌న్పీడీసీఎల్‌ నిరంతరం కృషి చేస్తుంది.

– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్‌

Advertisement
 
Advertisement
Advertisement