కూలీలకు వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కూలీలకు వసతులు కల్పించాలి

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

నర్మెట: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయాన్ని పొందాలని అడిషనల్‌ డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌ అన్నారు. మచ్చుపహాడ్‌లోని ఉపాధి హామీ (వరద నీటి అడ్డుకట్ట) పనులను శనివారం పరిశీలించిన ఆయన సిబ్బందికి, కూలీలకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరిగే విదంగా పీడర్‌ చానల్స్‌, పూడికతీత, పనులు చేపట్టాలని, పశువులు, జీవాల, కోళ్ల షెడ్డుల నిర్మాణాలు చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 7గంటలలోపే పనులకు హాజరుకావాలని, ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా పని ప్రారంభమైన నాలుగు గంటలకు రెండో సారి ఫొటో తీసిన అనంతరం వెళ్లాలని కూలీలకు సూచించారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక వైద్యుడు కూలీలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లింగాల హైమ రమేష్‌, ఎంపీఓ ఆకుల వెంకటమల్లికార్జున్‌, ఏపీఓ బిరుకూరి రమాదేవి, ఎఫ్‌ఏ భూక్య బిక్కు నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement