రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం
బాలాజీనగర్‌లో కోతకు గురైన రోడ్డు
గిర్నిగడ్డలో కొట్టుకపోయిన
సిమెంట్ రోడ్డు
సిమెంటు రోడ్డు
కొట్టుకపోయింది..
జనగామ: గిర్నిగడ్డలోని ఓ కాలనీలో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన వరద కారణంగా సీసీరోడ్డు తుడుచుకు పెట్టుకుపోయింది.
ఇదీ బాలాజీనగర్ రోడ్డు
జనగామ: భారీ వర్షంతో జనగామ పట్టణంలోని బాలాజీనగర్‌కు వెళ్లే రూట్‌లో మట్టిరోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డు ఎత్తుపళ్లాలు కావడంతో ద్విచక్రవాహన చోదకులు పల్టీలు కొడుతున్నారు.
జనగామ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ని అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాల ధాటికి అనేక రహదారులు కోతకు గురై, కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. కల్వర్టులు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీసీ, బీటీ రహదారులపై పగుళ్లు ఏర్పడి, గోతులు ఏర్పడడంతో ప్రయాణం నరకయాతనగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పల్లెపల్లెను కలిపే రహదారులు తెగిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల రవా ణా, అత్యవసర సేవలు కూడా స్తంభించిపోయే పరి స్థితి నెలకొంది. కొన్నిచోట్ల వర్షపునీరు రహదారులపై నిలిచి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయంలో ప్రయాణం చేయడం మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖలు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రహదారుల మరమ్మతులు, కల్వర్టుల పునర్నిర్మాణం తక్షణమే చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోంథా తుపానుతో కోతకు గురైన రోడ్లు
పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టాలని ప్రజల వేడుకోలు
రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం
రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం
రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం
రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం


