
బుగులు వేంకన్నను దర్శించుకున్న దేవాదాయ అసిస్టెంట్ కమిష
చిల్పూరు: చిల్పూరు గుట్ట బుగులు వేంకటేశ్వరస్వామిని ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్ కుటుంబ సభ్యులకు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావుల ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనా లు, ప్రసాదం అందించారు. జూనియర్ అసిస్టెంట్ కుర్రెలం మోహన్, వీరన్న, ధర్మకర్తలు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, మహేష్ పాల్గొన్నారు.