
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్–2025 అవసరమైన ఏర్పాట్లు చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 1,416 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. జిల్లాలో మొత్తం మూడు సెంటర్లు కేటాయించినట్లు చెప్పారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మంది, సెయింట్ మేరీ హైస్కూల్‌లో 480 మంది, స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 360 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి గంట ముండే రావాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్, బ్లాక్ పెన్సిల్‌తో మాత్రమే రావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
1,416 మంది విద్యార్థులు
మూడు పరీక్ష కేంద్రాలు
అమలులో నిమిషం నిబంధన