పాడి పరిశ్రమపై నీలి నీడలు | - | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమపై నీలి నీడలు

May 9 2025 1:04 AM | Updated on May 9 2025 1:04 AM

పాడి పరిశ్రమపై నీలి నీడలు

పాడి పరిశ్రమపై నీలి నీడలు

జనగామ: కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జనగా మలో ఓ వెలుగు వెలిగిన పాడి పరిశ్రమపై ప్రస్తు తం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాడి రైతులకు ప్రోత్సాహం అందించి, భరోసా కల్పించాల్సిన పాలకులు.. ఉన్న డీడీ (డిప్యూటీ డైరెక్టర్‌) పోస్టుకు మంగళం పాడేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పాపిరెడ్డి పోరాటంతో పాల వెల్లువ

జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి దివంగత మర్రి పాపిరెడ్డి చేసిన పోరాటంతో నాటి మంత్రి పొ న్నాల లక్ష్మయ్య సంపూర్ణ సహకారం అందించారు. పల్లె పల్లెన పాడిని అభివృద్ధి చేసేందుకు పాపిరెడ్డి నాటిన విత్తనం.. నేడు జిల్లా పాల వెల్లువలా మా రింది. మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు సబ్సిడీపై పాడి గేదెలు, దాణా, రుణాలు అందిస్తూ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు. అలాగే ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ కరువు ప్రాంతంలో పాడి పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విజయ డెయిరీ నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి గేదెలకు సబ్సిడీ రుణాలు తదితర ప్రోత్సాహకాలను నిలిపి వేశారు.

రోజూ 34వేల లీటర్ల సేకరణ

జిల్లాలో 5,500 మంది రైతుల నుంచి 225 విజయ పాల కేంద్రాల ద్వారా రోజువారీగా 34వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణలో రాష్ట్రంలో జనగామ 3వ స్థానంలో ఉంది. జిల్లా కేంద్రంలో 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రం అందుబాటులో ఉండగా.. బచ్చన్నపేటలో 6వేలు, నర్మెట 3 వేలు, 2వేలు(రెండు), పాలకుర్తి 3వేలు, స్టేషన్‌ఘన్‌పూర్‌ 5వేలు, లింగాలఘణపురం 2వేలు, సింగరాజుపల్లి 2వేలు, చిల్పూరు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న మినీ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ప్రతినెలా రూ.5కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ప్రోత్సాహం అందిస్తే పాల సేకరణ 50వేల లీటర్లకు చేరే అవకాశం ఉంది.

విజయ డెయిరీ డీడీ పోస్టు ఎత్తివేతకు రంగం సిద్ధం..?

పాల సేకరణలో రాష్ట్రంలో

జనగామకు గుర్తింపు

రోజుకు 34 వేల లీటర్ల పాల సేకరణ

ప్రోత్సాహం అందిస్తే

50వేల లీటర్లకు చేరే అవకాశం

పోస్టు ఎత్తివేతకు కుట్రలు..

పాడి పరిశ్రమతో రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్న సమయంలో వారిని ప్రోత్సాహించా ల్సిన తరుణంలో డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) పోస్టును ఎత్తి వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీడీ పర్యవేక్షణలో జనగామ విజయ పాల శీతలీకరణ కేంద్రం కొనసాగుతోంది. డెయిరీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇక్కడి డీడీ పోస్టును ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తరలించాలనే నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అలాగే దీనిపై ఇటీవల పాడి పరిశ్రమాభివృద్ధి కమిటీలోని పలువురు హైదరాబాద్‌లో ఉన్నతా ధికారులతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి డీడీ పోస్టు తరలించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఐదేళ్ల క్రితం పాలతో తయారు చేసే ఉత్పత్తులు, టెట్రా ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడే నెలకొలిపేందుకు ప్లాన్‌ చేయగా.. దీనిని సైతం పక్కన పెట్టారు. డీడీ పోస్టును తరలించి పాడి పరిశ్రమను నిర్వీర్యం చేయాలని చూస్తే పాపిరెడ్డి ఆశయానికి విలువ ఉండదని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement