
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ఆయా శాఖల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా సర్వే ప్రక్రియను పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాబోయే 15 రోజులు కీలకమని, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతీరోజు సెంటర్లను పరిశీలించి, నివేదికను సమర్పించాలన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్‌డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా