
కడవెండిలో భక్తిశ్రద్ధలతో బోనాలు
దేవరుప్పుల: మండలంలోని కడవెండిలో యాదవ సామాజిక వర్గం ఇలవేల్పు గంగాదేవి, కాటమరా జు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి వేర్వేరుగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలను ఎర్రబెల్లి అలంకరించి దేవతమూర్తులకు ప్రదర్శనగా వెళ్లి సమర్పించారు. అలాగే ఝాన్సీరెడ్డి గంగాదేవికి కుల సాంప్రదాయాల మేరకు జలగంప మొక్కులను సమర్పించారు. ఒగ్గు కళాకారులు ఆటపాటతో దేవతమూర్తుల విశిష్టతపై ప్రదర్శనలు ఇవ్వగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పెద్దగొల్ల, సారగొల్ల ప్రతినిధులు సుడిగెల కొమురయ్య, తోటకూరి మల్లయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు మారసాని శ్రీనివాస్, పీఏసీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి, నక్క రమేష్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నల్ల శ్రీరామ్, తీగల దయాకర్, మాజీ సర్పంచ్ హన్మంతు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కడవెండిలో భక్తిశ్రద్ధలతో బోనాలు