
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
– IIలోu
జనగామ: పట్టణంలో మద్యం దుకాణాలు.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ఇరుకు గల్లీల్లో రోడ్లకు ఇరువైపులా మందుబాబులు వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో అటుగా వెళ్లే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘బహిరంగ మద్యపానం–వైన్స్ ల ఎదుట సామాన్య ప్రజల ఇబ్బందులపై’ శనివా రం రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో అనేక విషయాలు వెలుగు చూశాయి.
● బస్టాండ్ చిన్నగేటు ఏరియాలోని భువన బార్ అండ్ రెస్టారెంట్ వెనుక గల్లీ పూర్తిగా వాహనాల పార్కింగ్‌తో నిండిపోయింది. మధ్యలో మిగిలిన చిన్న సందు నుంచి కూరగాయల మార్కెట్, ఇతర పనుల కోసం వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
● రైల్వేస్టేషన్ అమ్మబావి ప్రాంతం దుర్గావైన్స్ సమీపంలో కనీసం వీధి దీపాలు సరిగా లేవు. వైన్స్‌కు వచ్చే వారితో పాటు అందులో మద్యం సేవించి బయటకు వెళ్లిపోయే వారితో గుండ్లగడ్డ, అంబేడ్కర్‌నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
● ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలోని సింధు వైన్స్, లిక్కర్ మార్టుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కూరగాయల కొనుగోలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే కుటుంబాలు వైన్స్‌ను దాటేసి రావాలంటే భయపడి పోతున్నారు.
● సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉన్న బాలాజీబార్‌కు వచ్చే వాహనాలతో సింగిల్ లేన్ రోడ్డు పూర్తిగా నిండిపోతోంది.
● హైదరాబాద్ రోడ్డులోని బాలాజీబార్‌కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. తరుచూ ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. దుకాణా లు, ఆస్పత్రులకు వచ్చే మహిళలు, కుటుంబాలు భయంభయంగానే వెళ్తున్నారు.
● ఆర్టీసీ జంక్షన్‌లోని ఎస్‌ఎస్‌ఎస్ వైన్స్ ఎదుట ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై రెండు లేన్లలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.
● ఇదిలా ఉండగా నెహ్రూపార్కు ఏరియా నుంచి 60ఫీట్ల రోడ్డు, వడ్లకొండ రూట్, ప్రెస్టన్ ఏరియా, వీవర్స్‌కాలనీ, పెద్ద మోరీ తదితర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్స్, బార్లు, లిక్కర్ మార్టుల వద్ద మాత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకల కు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
సూర్యాపేట రోడ్డు బాలాజీబార్ వద్ద రోడ్డు సగభాగానికి వచ్చిన వాహనాల పార్కింగ్
న్యూస్‌రీల్
మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణ అస్తవ్యస్తం
బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్‌లు
విచ్చలవిడిగా వాహనాల నిలిపివేత
దారివెంట వెళ్లే మహిళలకు ఇబ్బందులు
‘సాక్షి’ విజిట్‌లో వెలుగులోకి సమస్యలు

ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025