
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్లపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో 13, ఘనపూర్ 17, పాలకుర్తిలో 10 మంది అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పరిశీలన పూర్తి కాగానే అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని వెల్లడించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు యునికోడ్ కేటాయింపు
ఆధార్‌తో దేశంలోని ప్రతీ పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యునికోడ్) కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, రైతులు తమ భూముల వివరాలతో కూడిన సమాచారంతో ఇ–ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతున్నదన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఇ–ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఫార్మర్ ఐడీ పొందడానికి రైతులు ఆధార్, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ తీసుకొని సమీప వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా