
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
లింగాలఘణపురం: మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల నుంచి కుందారం క్రాస్ రోడ్డు వరకు తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా రూరల్ సీఐ శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశా రు. నెల్లుట్ల–కుందారం క్రాస్‌రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘డేంజర్ జోన్’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సై శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.