
లక్ష్యానికి మించి రుణం
మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి
● స్వయం సహాయక సంఘాలకు రుణాలు
● బ్యాంకు లింకేజీ ద్వారా
రూ.532.84 కోట్లు
● సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల
చెల్లింపులు
● రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన జిల్లా
జనగామ రూరల్: స్వయం సహాయ క సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాల కు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు.
లక్ష్యానికి మించి రుణాల పంపిణీ
జిల్లాలో 5,777 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.476.47 కోట్ల రుణాల పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలరోజుల సమయం ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. మొత్తం రూ.532.84 కోట్ల రుణాలు(111.83 శాతం) పంపిణీ చేశారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.20 కోట్ల రుణాలు అందజేశారు. జిల్లాలో అత్యధికంగా చిల్పూరు మండలంలో 441 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.93.92 కోట్ల రుణాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 170 సంఘాలకు రూ.14.46 కోట్లు అందజేసి చివరిస్థానంలో నిలిచింది.
రికవరీ ఇలా.
బ్యాంకు లింకేజీ ద్వారా అందజేసిన రుణాల్లో దాదాపు రూ.50 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.20 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.62 శాతం రికవరీ అయినట్లు పేర్కొన్నారు. రుణాల పంపిణీతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ.. తీసుకున్న రుణం డబ్బులు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.
2024–25 సంవత్సరం మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు(రూ.కోట్లలో)
మండలం సంఘాలు రుణ లక్ష్యం పంపిణీ
బచ్చన్నపేట 886 45.51 39.69
చిల్పూర్ 828 45.84 93.92
దేవరుప్పుల 859 48.56 35.56
స్టేషన్‌ఘన్‌పూర్ 917 44.28 51.53
జనగామ 709 36.15 51.59
కొడకండ్ల 578 25.56 42.39
లింగాలఘణపురం 818 41.31 40.14
నర్మెట 363 20.21 15.81
పాలకుర్తి 1087 54.06 46.81
రఘునాథపల్లి 1066 50.25 67.02
తరిగొప్పుల 419 24.24 14.46
జఫర్‌గఢ్ 748 40.50 34.46
మొత్తం 9,278 476.47 532.84
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాల సభ్యులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు లక్ష్యానికి మించి రూ.532 కోట్ల రుణాలు అందజేశాం. రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
– వసంత, డీఆర్డీఓ

లక్ష్యానికి మించి రుణం

లక్ష్యానికి మించి రుణం