ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం

May 3 2025 7:42 AM | Updated on May 3 2025 7:42 AM

ఆలయ అ

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం

స్టేషన్‌ఘన్‌పూర్‌: హనుమకొండకు చెందిన కానిస్టేబుల్‌ రఘునాయకుల రవిప్రసాద్‌రెడ్డి, అతడి కుమార్తె రశ్మితరెడ్డి ఆధ్వర్యాన స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండలోని శివాల యం అభివృద్ధికి రూ.1.50లక్షలు విరాళం అందజేశారు. భగవంతుడి కృపతో తన కుమార్తె రశ్మితరెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నదని, గతంలో మొక్కుకున్న విధంగా ఆలయ అభివృద్ధికి విరాళంగా శుక్రవారం ఆ మొత్తాన్ని అందజేసినట్లు రవిప్రసాద్‌రెడ్డి తెలి పారు. కానిస్టేబుల్‌ గుంజ కుమారస్వామి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

జనగామ రూరల్‌: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్‌లోని ప్రధాన ఈవీఎం గోదాంను కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమో దు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, నియంత్రణ పద్ధతులను తెలుసుకున్న ఆయన భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జనగామ తమాసీల్దార్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిక్షణను వినియోగించుకోవాలి

పాలకుర్తి టౌన్‌: ప్రభుత్వం క్రీడాకారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిధి ఏడు మండలాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, సెలవులను వృథా చేయకుండా క్రీడలను ఆస్వాదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్న త పాఠశాల హెచ్‌ఎం శైలజ, పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోర్‌సింగ్‌, పీడీ చిట్యాల యాదగిరి, ఎస్సై పవన్‌కుమార్‌, చెరిపెల్లి యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం : ఎస్‌ఈ

జనగామ: విద్యుత్‌ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం.. భద్రతను అందరు బాధ్యతగా తీసుకుంటే ఇది సాధ్యమని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌ అన్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జనగామ మండలం గానుగుపహా డ్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్‌ అధికారులు చేపట్టిన పొలం బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నద ని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని రకాల భద్రత పరికరా లు అందించామని చెప్పారు. విద్యుత్‌ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్‌ ప్రమాదాల నివారణ వివరాల పోస్టర్‌ ను ఆవిష్కరించారు. సదస్సులో డీఈ లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు.

మెరిట్‌ ఆధారంగానే నియామకాలు : డీఎంహెచ్‌ఓ

జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన జాతీయ ఆరోగ్య మిషన్‌ స్కీంలో పలు కేటగిరీ లకు సంబంధించి ఉద్యోగ నియామకాలను మెరిట్‌ ఆధారంగా చేపట్టినట్లు డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంకు చెందిన మారపాక ప్రేమ్‌కుమార్‌ సీనియర్‌ ట్రీట్మెంట్‌ సూపర్‌వైజ ర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. ఆయన కు సంబంధించి అర్హతలతో కూడిన ఎంపీహెచ్‌ఏ(ఎం) సర్టిఫికెట్‌ 2021 ఏప్రిల్‌తో కాలపరిమి తి ముగిసిందని, రెన్యువల్‌ చేయించుకుని గడువులోగా సమర్పించక పోవడంతో పరిగణలోకి తీసుకోలేదన్నారు. మెరిట్‌ జాబితాలో నంబ రింగ్‌లో ఒకటి నుంచి 11 వరకు ఉన్న అభ్యర్థు లను ఉద్యోగానికి అవసరమైన అర్హతలు లేని కారణంగా ఎంపిక చేయలేదని తెలిపారు. ప్రేమ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ము గ్గురు అధికారులతో కమిటీని నియమించామ ని, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిన ట్లు నిర్థారించినట్లు తెలిపారు.

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం1
1/2

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం2
2/2

ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement