
5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
జనగామ రూరల్: పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్‌గా తీసుకొని గ్రామాల్లో ఈనెల 5వ తేదీ నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో కలిసి వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో పొజిషన్‌లో ఉన్న రైతుల దరఖాస్తులు పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్‌లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పట్టాలు ఉండి పొజిషన్‌లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని, హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసినవారు భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమి క్రమబద్ధీకరించాలో ప్రభుత్వం నిర్ణయిరస్తుంన్నా రు. ఈ సందర్భంగా ‘నీట్’ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు.