
పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ
రఘునాథపల్లి: ఇటీవల రఘునాథపల్లి జీపీ కార్యదర్శిగా పనిచేసిన కవిత రూ.9.20లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీపీఓ నాగపురి స్వరూప విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెల్ది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కమిత.. రఘునాథపల్లి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును ఎస్టీఓలో జమ చేయకుండా నేరుగా ఖర్చు చేశారని, ఇది చట్టవిరుద్ధమని డీపీఓ పేర్కొన్నారు. ఖర్చు చేసే ముందు గ్రామసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా స్థాయికి మించి ఖర్చు చేసినట్లు వివరించారు. రూ.5వేలకు మించి ఖర్చు చేసే అధికారం కార్యదర్శికి లేదని, వసూలైన మొత్తాన్ని పంచాయతీ పను ల నిమిత్తం ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లులు సడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపా రు. ఆమె వెంట ఎంపీఈఓ వెంకటేశ్వర్లు, పంచాయ తీ కార్యదర్శి బాలకిషన్ ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి కవిత మాట్లాడుతూ.. తాను ఒక్క పైస కూడా దుర్వినియోగం చేయలేదని, గ్రామ సమస్య ల పరిష్కారం నిమిత్తం వసూలైన డబ్బుల నుంచి నేరుగా ఖరు చేయాల్సి వచ్చిందని వివరించారు.