
ఖైదీలకు హక్కులు తెలియాలి..
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్: ఖైదీలకు తమ హక్కులు తెలియాలి.. ఈ మేరకు జైలు, జైలు బయట వివరా లతో కూడిన పోస్టర్లను అంటించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జైలులో వసతులు, భోజనం, అలాగే ఖైదీల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, ప్రతి ఒక్కరికీ న్యాయవాది ఉండాలని చెప్పారు. సమస్యలు ఉంటే రాసి సబ్ జైలులోని బాక్స్‌లో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.