దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 1 2025 1:11 AM | Updated on May 2 2025 2:35 PM

జనగామ: మూడేళ్ల డిప్లామా ఇన్‌ హ్యాండ్లూ మ్స్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో మొదటి, రెండవ సంవత్సరంలో ‘లేటరల్‌ ఎంట్రీ’ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిషా రాష్ట్రం బర్గ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీలో 9 సీట్లకు 8+1 ఈడబ్యూస్‌ ప్రాతిపదికన అడ్మిషన్లకు తెలంగాణకు చెందిన టెన్త్‌ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ సబ్జెక్టుగా పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. 

అన్ని కేటగిరీల్లో ప్రవేశానికి వయసు 2025 జూలై 16 నాటికి 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 15–25 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లేటరల్‌ ఎంట్రీకి గానూ మ్యాఽథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో 10+2లో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్‌ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు డీహెచ్‌, టీటీ కోర్సు(లేటరల్‌ ఎంట్రీ) సెకండియర్‌లో ప్రవేశానికి అర్హులని వివరించారు. దరఖాస్తులను జూన్‌ 7వ తేదీలోగా చేనేత, జౌళిశాఖ జనగామ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ఉద్యమకారులకు అవార్డులు

జనగామ : జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులకు హైదరాబాద్‌లో శ్రీకాంత్‌చారి మెమోరియల్‌ అవార్డ్స్‌–2025 బుధవా రం అందజేశారు. అవార్డులను శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మ తెలంగాణ ఉద్యమ కణం, ఓయూ జేఏసీ చైర్మన్‌ దరువు సంస్థ నిర్వాహకురాలు అరుణ బంగారం సమక్షంలో ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న వారిలో దిగోజు నర్సింహాచారి, అయిలా సోమనర్సింహాచారి. గంగాభవాని, కృష్ణ, సోమేశ్వరాచారి, సంజీవ, ప్రతాప్‌, సాయికిరణ్‌, రవి పలువురు ఉన్నారు.

మైనార్టీలకు ఉచిత కోచింగ్‌

జనగామ రూరల్‌: యూపీఎస్‌సీ సీసాట్‌ పరీక్ష కోసం(2025–26 విద్యా సంవత్సరం) మైనార్టీ అభ్యర్థులు ఉచిత కోచింగ్‌కు దరఖాసుచేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్‌ బి.విక్రమ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, అన్ని రిజర్వ్‌ కేటగిరీల్లో వికలాంగులకు 5శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే వారు అడ్మిషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు అర్హులని, మే 1 నుంచి 24 వరకు అప్లికేషన్ల స్వీకరణ, జూన్‌ 5న అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పరీక్ష ఉంటుందని వివరించారు.

రేపు ‘విజయోస్తు’ సంబరాలు

జనగామ రూరల్‌: ‘విజయోస్తు’ కార్యక్రమంతో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. బుధవారం వెలువడిన సందర్భంగా డీఈఓ రమేశ్‌ కలెక్టర్‌ను తన కార్యాలయంలో కలిసి సీట్లు పంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యా సంవత్స రం ఆరంభం నుంచే విజయోస్తు కార్యక్రమం రూపొందించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పా రు. ఈనెల 2న ‘విజయోస్తు’ సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement