
‘పది’లో షైన్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: పదో తరగతి ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. బుధవారం వెలుబడిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేల విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు జిల్లాకే తలమానికంగా నిలిచారన్నారు. షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’నే కాదని అన్నిరంగాల్లో ముందుంటామని మరోసారి రూఢీ అయ్యిందన్నారు. జిల్లాలోనే తమ పాఠశాల విద్యార్థి బి.ఆదిత్య దీక్షిత్ 588 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. జి.జ్ఞానదీప్ 580, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ 579, సాయిశ్రీ 578, మణిచందన 577, కార్తీక, త్రిషిక పటేల్ 576, సంప్రీత్ 575, రాజేష్ 574 మార్కులు సాధించారన్నారు. 23 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 53 మంది 560 మార్కులకు పైగా, 92 మంది 550 మార్కులకు పైగా, 371 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. వరంగల్ మహానగరంతో పాటు రాష్ట్రస్థాయిలో షైన్ విద్యార్థులు ముందువరుసలో నిలిచారన్నారు. తెలుగులో 155 మంది, హిందీలు 90 మంది, ఇంగ్లిష్‌లో 299 మంది, గణితంలో 242 మంది, సైన్స్‌లో 217 మంది, సోషల్‌లో 154 మంది ఏ1 గ్రేడ్ సాధించారన్నా రు. డైరెక్టర్ పి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ దే శంలోని ప్రతీ ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యార్థులున్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమన్నారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్ట చైర్మన్ జె.శ్రీనివాస్, ప్రి న్సిపాల్‌లు జి.రాజ్‌కుమార్, పి.విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి, ఉపాధ్యాయుల అభినందించారు.