
శివాని విద్యాసంస్థల విజయభేరి
హసన్‌పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో శివాని విద్యాసంస్థలు విశ్వరూపం ప్రదర్శించాయి. పాఠశాలకు చెందిన రుద్రోజు శ్రేష్ట 577 మార్కులు, దివిజా 569, శ్రీనిత్యా 553, అంచూరి మానస 551, కుంట మనోజ్ 546, భూపతి అశ్వితారెడ్డి 545, ఽశస్త్ర రాఘశ్రీ 543, పెద్దిరెడ్డి మణిదీప్ రెడ్డి 539, ప్రణవ్ 539, దీవన్‌కుమార్ 538 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో శివానీ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి.స్వామి, డైరెక్టర్లు సురేందర్‌రెడ్డి, చంద్రమోహన్, రాజు, ఎన్.రమేష్, మురళీధర్, వి.సురేష్, సంతోష్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.