
గౌరవం పెరిగేలా పోలీసులు పనిచేయాలి
● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాజీపేట/మడికొండ: ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాజీపేట, మడికొండ పోలీస్ స్టేషన్‌ను సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా ల పనితీరు, కేసుల నమోదు, పరిష్కరానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఏసీపీ తిరుమల్, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు శివకృష్ణ, నవీన్ కుమార్, లవన్‌కుమార్, మడికొండ ఎస్ ఎచ్‌ఓ కిషన్, ఎస్సై రాజ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలు
హసన్‌పర్తి: హనుమకొండ, అంబాల మార్గమధ్యలో ఎర్రగట్టు గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. పరకాల మండలం సీతానాగారాని కి చెందిన శ్రీనివాస్, లలిత దంపతులు బుధవారం ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి అంబాల వైపునకు వెళ్తున్నారు. ఎర్రగట్టు గు ట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రధాన ర హదారిపై ఉన్న గేట్‌వాల్వ్ గుంతను ఢీకొన్నారు. దీంతో శ్రీనివాస్ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గేట్‌వాల్వ్ గుంత విషయం అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడంలేదని స్థానికులు వాపోతున్నారు.