
ప్రణాళికాబద్ధంగా యాసంగి కొనుగోళ్లు
జనగామ రూరల్: ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న బియ్యం నాణ్యతపై సామాజిక మాద్యమాల్లో వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే ఖండించాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజా్‌వ్‌న్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, సివిల్ సప్లయీస్ డీఎం హతీరాం, మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి