
దాత సహకారంతో నిర్మాణం
కొడకండ్ల : మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పనులను దాత సహకారంతో చేపట్టినట్లు సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ అబ్దుల్‌హక్ తెలిపారు. సోమవారం పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం సొంత భవన నిర్మాణ పనులు నిచిపోయాయని, నెల రోజుల క్రితం డీఐజీ సుహాసిని, డీఆర్ హరికోట్ల రవి కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా అద్దె భవనంలో సరైన వసతులు లేవన్నా రు. దీంతో సొంత భవన నిర్మాణానికి దాతల సహకారం కోరాలని సూచించగా స్థానికంగా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. తొర్రూరుకు చెందిన దాత ముందుకొచ్చి రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించగా పనులు చేపట్టామన్నారు. ప్రస్తుత అద్దె భవనం అగ్రిమెంట్ పూర్తయినందున త్వరగా కార్యాలయాన్ని సొంత భవనంలోకి మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాల య స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాల్లో వాస్తవం లేదని, దాత ఇచ్చిన డబ్బుతో నిర్మాణ పనులు చేపడుతున్నామ ని ఆయన వివరించారు.