ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
మల్యాల/కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో, పాక్స్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. తేమశాతం రాగానే ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే కొడిమ్యాల మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఎంతమంది రైతులు ధాన్యం తీసుకువచ్చారు తదితర వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ వసంత, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నరసింహస్వామి, ఆర్‌ఐలు తిరుపతి, రాజారాం తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి 80,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 70,588 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆ మేరకు ప్రాజెక్టు నుంచి వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చే స్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 650, భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాలటౌన్: ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం, పని భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ) జిల్లా ఇన్‌చార్జి వెన్న మహేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజూ రెండుకూరలు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదన్నారు. మెస్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు మునుగూరి హన్మంతు, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన


