అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్(జగిత్యాల): అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో లబ్ధిదారు మ్యాకల సరస్వతి ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో శుక్రవారం గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై ఆడబిడ్డ కట్నంగా చీర అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు రవీందర్‌రావు, కోల శ్రీనివాస్, సురేందర్‌నాయక్, వెంకటేశ్‌గౌడ్, అనుపురం శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రకాశ్, నవీన్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
జగిత్యాల: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నూతనంగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు


