దేశ ఐక్యతకు మార్గదర్శి వల్లభాయ్ పటేల్
జగిత్యాలక్రైం: దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్ల భాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పటేల్ దూరదృష్టి, చర్యల ద్వారా దేశ ఐక్యత సాధ్యమైందన్నారు. అనంతరం రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన 3కే రన్ న్యూ బస్ స్టాండ్, ఆర్డీవో చౌరస్తా, ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది. డీఎస్పీలు వెంకటరమణ, వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
3కే రన్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ
పటేల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న
ఎస్పీ అశోక్‌కుమార్, పోలీసులు
దేశ ఐక్యతకు మార్గదర్శి వల్లభాయ్ పటేల్


