
మహనీయుడు వాల్మీకి మహర్షి
జగిత్యాల: రామాయణం మహాకావ్యాన్ని గ్రంథరూపంలో అందించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవిత పాఠాలు నేర్పిన రామాయణాన్ని ప్రతిఒక్కరం గుర్తు చేసుకోవాలన్నారు. రామాయణం కథ మాత్రమే కాదని, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలు నేర్పే అద్భుత పాఠంలా ఉపయోగపడుతుందన్నారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, బీసీ సంక్షేమాధికారి సునీత, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు.