
‘ఇందిరమ్మ ఇళ్ల’ వేగం పెంచాలి
మెట్‌పల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను మంగళవారం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షిస్తూ నిర్మాణాలు గడువులోగా పూర్తయ్యేలా లబ్ధిదారులు, మేసీ్త్రలను అప్రమత్తం చేయాలన్నారు. ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, గృహ నిర్మాణశాఖ అధికారి వాసం ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు
కోరుట్ల: నవోదయ విద్యాలయానికి కేటాయించిన భవనంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న నవోదయ భవనాన్ని పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, తలుపులు, కలర్స్, నీటిసౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య పాల్గొన్నారు.
తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలి
మెట్‌పల్లి:మెట్‌పల్లిలో శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాల భవనాన్ని రెండు రోజులుగా కూల్చివేస్తున్నారు. ఆ పనులను కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జూనియర్ కళాశాల గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నా.. పక్షం రోజుల్లో తాత్కాలిక భవనాన్ని చూసి అందులోకి తరలించాలన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్